పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించాలి

భువనగిరి రూరల్‌, డిసెంబరు 28 : పేదలకు మెరుగైన వైద్య సేవలందించి ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పెంచేలా వైద్యులు శ్రద్ధ వహించాలని జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీ్‌పరెడ్డి సూచించారు. జడ్పీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన వి ద్య, వైద్య స్థాయి సంఘం సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యు లు, సిబ్బంది అందుబాటులో ఉండి రోగులకు మె రుగైన సేవలు అందేలా చూడాలన్నారు. స్థాయి సంఘం సభ్యుడు, ఆలేరు జడ్పీటీసీ కుడుదుల నగేష్‌ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో మదర్‌ అండ్‌ చైల్డ్‌ హెల్త్‌ (ఎంసీహెచ్‌) కేంద్రం ఏర్పాటు కు రెండేళ్ల క్రితమే రూ.17కోట్లు నిధులు మం జూరైనా స్థలం అందుబాటులో లేకపోవడం, వైద్యాధికారుల నిర్లక్ష్యంతో నిధులు వెనక్కి వెళ్లాయన్నారు. ఆ కేంద్రాన్ని అప్పట్లో ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేయాలని తాను వైద్యారోగ్య శాఖ మంత్రిని కోరినా ఫలితం దక్కలేదన్నారు.

 

ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ను భువనగిరితో పాటు ఆలేరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని 6నెలలుగా కోరినా పట్టించుకోవడం లేదని డీఎంహెచ్‌వో సాంబశివరావు, డీసీసీహెచ్‌ చందూలాల్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. వైద్యఆరోగ్య కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకొని నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని జడ్పీ చైర్మన్‌ పేర్కొన్నారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని కోఆప్షన్‌ సభ్యులు ఎండీ.ఖలీల్‌ డీ ఈవో చైతన్య జైనికి సూచించారు. బీబీనగర్‌ జడ్పీటీసీ, స్టాండింగ్‌ కమిటి చైర్మన్‌ గోళి ప్రణిత అధ్యక్షతన జరిగిన మహిళా, శిశు సంక్షేమ శాఖ స్థాయి సంఘం సమావేశంలో సమగ్ర శిశు అభివృద్ధి, ఆరోగ్య లక్ష్మి, పిల్లల పోషణ, పోషణ అభియాన్‌, బాలల పరిరక్షణ, అంగన్‌వాడీ కేంద్రాల పర్యవేక్షణపై సమీక్షించారు. సమావేశంలో డిప్యూటీ సీఈ వో శ్రీనివాసరావు, ఐసీడీఎస్‌ పీడి కృష్ణవేణి తదితరులు ఉన్నారు.