అనారోగ్యంతో యువకుడు ఆత్మహత్య

గుడిబండ, డిసెంబరు 28: మండలంలోని దిన్నేహ ట్టి గ్రామానికి చెందిన నాగరాజు కుమారుడు ఓంకారప్ప (27) శనివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌హెచ్‌ఓ విజయ్‌కుమార్‌ తెలిపారు. ఆయన తెలిపిన మేరకు ఓంకారప్పకు నెల రోజుల నుంచి కడుపునొప్పి వచ్చేదని, ఆసుపత్రుల్లో చికిత్సలు చేయించుకున్నా నయం కాలేదన్నారు. దీంతో జీవితంపై విరక్తి చెంది ఇంటిలో ఎవ రూలేని సమయంలో దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మే రకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.