రఘునాథపాలెం : మిషన్ ఇంద్రధనుష్, పల్స్‌పోలియో కార్యక్రమాలను విజయవంతం చేయాలని జిల్లా వ్యాక్సిన్ మేనేజర్ సీహెచ్‌వీ రమణ పిలుపునిచ్చారు. మంచుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని రోటరీనగర్, గోపాలపురం, పుట్టకోట ప్రాంతాల్లో టీకాల కార్యక్రమాన్ని శనివారం ఆయన పరిశీలించారు. జనవరి 6 నుంచి మిషన్ ఇంద్రధనుష్, 19 నుంచి పల్స్‌పోలియో కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు. కార్యక్రమంలో ఏఎన్‌ఎంలు సావిత్రి, అమృత, పర్వీన్, నాగమణి, అంగన్‌వాడి టీచర్లు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.