ప్రభుత్వ వైద్యుల క్రికెట్‌లో ఖమ్మం గెలుపు

ఖమ్మం : ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ వైద్యులు ఆదివారం ఖమ్మం ఎస్‌ఆర్‌బీజీఎన్‌ఆర్‌ కళాశాల మైదానంలో క్రికెట్‌ మ్యాచ్‌ ఆడారు. ఈ మ్యాచ్‌లో ఖమ్మం జట్టు గెలుపొందింది. ఉత్సాహభరితంగా జరిగిన మ్యాచ్‌ ప్రారంభ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ మాలతి ముఖ్యతిథిగా వచ్చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ వైద్యులు కొంత తీరిక చేసుకొని మైదానాలకు రావాలన్నారు. వ్యాయామం అందరికీ అవసరమన్నారు. అనంతరం క్రీజ్‌పై బ్యాటింగ్‌ చేసి పోటీని ప్రారంభించారు. 12 ఓవర్లలో కొత్తగూడెం జట్టు 76 పరుగులు సాధించింది. తర్వాత బ్యాటింగ్‌ చేసిన ఖమ్మం జట్టు ఒక వికెట్‌ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.