మంత్రి ఈటల చేతుల మీదుగా అవార్డు అందుకున్న సుధాకర్‌రావు

పాలకుర్తి  : రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ చేతుల మీదుగా ఐడియా సంస్థల చైర్మన్‌ మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ నెమురుగొమ్ముల సుధాకర్‌రావు అవార్డు అందుకున్నారు. గురువారం రాత్రి హైదరాబాద్‌లో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో అవార్డుల కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ డయాబెటిక్‌ విభాగంలో హైదరాబాద్‌ ఐడియా డయాబెటిక్‌ క్లినిక్‌లో ప్రథమస్థానంలో నిలవడంతో సుధాకర్‌రావు ఈ అవార్డును అందుకున్నారు. ఈసందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ వైద్య రంగంలో డాక్టర్‌ సుధాకర్‌రావు చేస్తున్న కృషి మరవలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఐడియా డైరెక్టర్లు డాక్టర్‌ శ్యాం, డాక్టర్‌ భవాని, మేనేజర్‌ రామాంజనేయులు పాల్గొన్నారు.