వసతి గృహంలో దారుణం.. గర్భం దాల్చిన విద్యార్థినులు!

కొమురం భీం జిల్లా : అసిఫాబాద్‌లో ట్రైబల్‌ మహిళా డిగ్రీ కళాశాలలో దారుణ ఘటన వెలుగుచూసింది. ట్రైబల్‌ హాస్టల్‌ ఉంటూ చదువుకుంటున్న ముగ్గురు విద్యార్థినులు గర్భం దాల్చడం కలకలం సృష్టిస్తోంది. తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెంటల్‌ డిగ్రీ కాలేజీ వసతి గృహానికి చెందిన పదిమంది విద్యార్థినులకు సక్రమంగా రుతుస్రావం రాకపోవడంతో అనుమానం వచ్చి హాస్టల్‌ సిబ్బంది వారిని రిమ్స్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు.పరీక్షలు నిర్వహించిన వైద్యులు సంచలన విషయాలు వెల్లడించారు.