రిమ్స్‌ ఆర్‌ఎంఓగా శోభాపవార్‌

ఆదిలాబాద్‌ : రిమ్స్‌ ఆసుపత్రి సివిల్‌ సర్జన్‌ ఆర్‌ఎంఓగా శోభా పవార్‌ నియమితులయ్యారు. ఆదిలాబాద్‌ అదనపు డీఎంహెచ్‌ఓ(క్షయ నివారణ విభాగం)గా పని చేసిన ఆమె ఇటీవలనే జేడీగా పదోన్నతి పొంది హైదరాబాద్‌ బదిలీ అయ్యారు. అనంతరం ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆసుపత్రి సీఎస్‌ ఆర్‌ఎంఓగా నియమితులయ్యారు. ఈ మేరకు నియామక ఉత్తర్వులను ఆమె శనివారం రిమ్స్‌ సంచాలకుడు బి.కరుణాకర్‌కు అందజేశారు.