దోమలపై ఇక సమరమే! నివారణ చర్యలకు వార్షిక ప్రణాళిక

హైదరాబాద్‌


బల్దియా కమిషనర్‌ డి.ఎస్‌.లోకేష్‌కుమార్‌ దోమల విభాగంలో ప్రక్షాళన చేపట్టారు. ముఖ్య ఉన్నతాధికారిని బాధ్యతల నుంచి తొలగించారు. డివిజన్‌కు ఒకటి చొప్పున ఉన్న ఫాగింగ్‌ యంత్రం స్థానంలో మరో యంత్రాన్ని చేర్చారు. ఏడాది మొదటి నుంచే ప్రణాళికాబద్ధంగా పనిచేసేందుకు అవకాశం కల్పించారు.


వార్షిక ప్రణాళిక రూపకల్పన అంశాలివీ...
కార్యాచరణ చర్యలపై సమీక్ష, దోమల ప్రభావిత ప్రాంతాల గుర్తింపు


జ్వరం కేసుల వివరాలను రోజూ నమోదు చేసుకోవడం, వారానికోసారి జ్వరాలపై సమీక్షించడం


దోమల మందుల నిల్వను చూసుకోవడం, నాలాలు, చెరువులు, నీటి నిల్వ ప్రాంతాల్లో మందు పిచికారీః  ఇంటింటి సర్వే, సీజనల్‌ వ్యాధులపై వైద్య శిబిరాలు


ఏప్రిల్‌లో  దోమల సమస్యపై సర్వే


ఏప్రిల్‌ 25న దోమల ప్రపంచ మలేరియా దినం


మేలో డెంగీ నివారణ వారోత్సవాలు, టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది సమావేశాలు


మే 16న ప్రపంచ డెంగీ దినోత్సవ నిర్వహణ


జూన్‌ను మలేరియా వ్యతిరేక మాసంగా ప్రకటించడం, దోమల నివారణపై చైతన్య కార్యక్రమాలు, ఔషధాలు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల్లో ఉండేలా చూడటం


జులైలో ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహణ, అవగాహన కార్యక్రమాలు, డెంగీ వ్యతిరేక మాసం ఉత్సవాలు


ఆగస్టులో దోమల మందుల నిల్వపై సమీక్ష, ఆరోగ్య కేంద్రాల్లో మందులు ఉండేలా చూడటం


సెప్టెంబరులో పౌరుల స్పందన తీసుకోవడం, జీహెచ్‌ఎంసీ పరిధిలో నమోదయ్యే డెంగీ, మలేరియా వ్యాధులపై సమీక్ష


అక్టోబరులో దోమల వృద్ధి ఏ స్థాయిలో ఉందో గుర్తించడం, తదుపరి నెల ప్రణాళికను నిర్ధరించుకోవడం, వ్యాధులు నమోదైన ప్రాంతాల తనిఖీ


నవంబరు, డిసెంబరులో మలేరియా, డెంగీ, మెదడు వ్యాపు వ్యాధి, తదితర అనారోగ్య సమస్యలపై సంబంధిత విభాగాలతో సమాలోచనలు చేస్తారు.