నందిపేట్: నందిపేట్‌కు చెందిన క్షతగాత్రుడు సత్యనారాయణ(32) చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఎస్సై రాఘవేందర్ కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సత్యనారాయణ, మరికొందరు నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమంలో ఆలయ నిర్మాణ పనులు చేయడానికి వచ్చారు. ఆదివారం రాత్రి సత్యనారాయణ, తన సహచరుడు ఏడు కొండలు, మరో వ్యక్తి ఆశ్రమం నుంచి గ్రామం వైపు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ సమయంలో వెనక నుంచి ద్విచక్రవాహనం వేగంగా వచ్చి వీరిని ఢీకొట్టింది. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికు తరలించారు. చికిత్స పొందుతూ సత్యనారాయణ మృతి చెందాడన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై చెప్పారు.