అమలాపురం , డిసెంబరు 28: విధి నిర్వహణలో నిత్యం ఎన్నో ఆటుపోట్లతో ఒత్తిళ్లకు గురవుతూ పోలీసులు అనారోగ్యం బారిన పడుతున్నారు. వారి ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తోందని రాష్ట్ర సాంఘికసంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ పేర్కొన్నారు. అమలాపురం సత్యనారాయణ గార్డెన్స్‌లో శనివారం అమలాపురం సబ్‌డివిజన్ పోలీసు సిబ్బందికి, కుటుంబ సభ్యుల కోసం కిమ్స్ ఆసుపత్రి సౌజన్యంతో మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటుచేశారు. శిబిరాన్ని మంత్రి విశ్వరూ్‌పతో కలిసి వివిధ విభాగాలను ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ప్రారంభించారు. డీఎస్పీ షేక్ మసూమ్‌బాషా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి విశ్వరూప్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు.