ప్రభుత్వ దవాఖానలో అరుదైన శస్త్ర చికిత్స

మహబాబాబాద్‌ : మహబూబాబాద్‌ ప్రభుత్వ దవాఖానలో శుక్రవారం డాక్టర్లు అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించి 1.5 కేజీ గల క్యాన్సర్‌ గడ్డను తొలగించారు. దవాఖాన సీనియర్‌ గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ బీ వెంకట్రాములు, సివిల్‌ సర్జన్‌ నాగేశ్వర్‌రావు, అనేస్తేసియా డాక్టర్‌ ఎం సూర్యకుమారి, డాక్టర్లు వినిల్‌రెడ్డి, శ్రీనివాస్‌ బృందం ఆధ్వర్యంలో మహబూబాబాద్‌ పట్టణానికి చెందిన రేణుకకు శస్త్ర చికిత్స నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ వెంకట్రాములు మాట్లాడుతూ జిల్లాలో మొదటిసారి రొమ్ము క్యాన్సర్‌ ఆపరేషన్‌ నిర్వహించినట్లు తెలిపారు. అనుభవజ్ఞులైన డాక్టర్‌ నాగేశ్వర్‌రావు ఆధ్వర్యంలో ఇంతకముందు కూడా గ్యాంగ్రిన్‌, థైరాయిడ్‌, క్యాన్సర్‌, సంబంధిత ఆపరేషన్లు నిర్వహించినట్లు వివరించారు. కార్పొరేట్‌ స్థాయిలో అం దించే వైద్యంను ఈ ఆపరేషన్‌కు అందించామని పేర్కొన్నారు. డాక్టర్‌ సూర్యకుమారి మాట్లాడుతూ తొరాసిక్‌ ఎపిడ్యూరల్‌ అనేస్తిసియా ద్వారా ఆపరేషన్‌ చేసినట్లు తెలిపారు. డాక్టర్‌ నాగేశ్వర్‌రావు మహబూబాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో వివిధ రకాల క్రిటికల్‌ కేర్‌ ఆపరేషన్లు చేసినట్లు తెలిపారు.