వామ్మో చలి

అత్యల్పంగా 15.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

సంగారెడ్డి : జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరుగుతున్నది. శనివారం జిల్లాలో 15 డిగ్రీల కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యల్పంగా గుమ్మడిదలలో 15.3 డిగ్రీల నమోదు కాగా, అత్యధికంగా కందిలో 22.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అయితే జిల్లాలోని నారాయణఖేడ్‌లో 15.7, హత్నూర, జహీరాబాద్‌లో 15.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యల్పంగా 7.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్‌ జిల్లాలో నమోదయ్యాయి. ఇదిలా ఉండగా జిల్లాలోని ఆయా ప్రాంతాల్లోని ప్రజలు వెచ్చదనం కోసం చలి మంటలు కాపుతున్నారు. ఉదయం పూట ఇండ్ల నుంచి బయటకు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే వెచ్చని దుస్తులు ధరించి తమ పనుల కోసం వెళ్తున్నారు. ఇదిలా ఉండగా రాను న్న రోజుల్లో మరింత కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉన్నదని సంబంధిత అధికారులు పేర్కొంటున్నా రు. ప్రజలు, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృ ద్ధులు వెచ్చని దుస్తులు ధరించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వారు సూచిస్తున్నారు.