ఆసిఫాబాద్ : కుమురం భీం జిల్లాలో తలసేమియా, సికిల్‌సెల్ వ్యాధి బాధితుల కోసం ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి రక్తం ఎక్కించే వసతులు కల్పించాలని కోరుతూ సోమవారం తలసేమియా బాధితుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జడ్పీ ఛైర్‌పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కులకు వినతిపత్రం సమర్పించారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో రక్తనిధి కేంద్రాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా తలసేమియా, సికిల్‌సెల్ వ్యాధితో బాధపడుతున్న బాలలతో తలిదండ్రులు ఆసుపత్రికి తరలివచ్చారు. రక్తనిధి కేంద్రం ప్రారంభం అనంతరం జడ్పీ ఛైర్‌పర్సన్, ఎమ్మెల్యేలను కలిసి మొరపెట్టుకున్నారు. ఇక్కడి రక్త నిధి కేంద్రంలో ఈ వ్యాధిగ్రస్తుల కోసం బ్లడ్ కాంపోనెంట్స్ యంత్రాన్ని ఏర్పాటు చేసి రక్తాన్ని సిద్ధం చేయాలని కోరారు. వీరికి రక్తం ఎక్కించేందుకు ప్రత్యేక వార్డును సమకూర్చాలని, ఆరోగ్య శ్రీ ద్వారా రక్తం ఎక్కించే ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లాలో 400 మంది బాలలు తలసేమియా, సికిల్‌సెల్‌తో బాధపడుతున్నట్లు వివరించారు. వినతిపత్రం సమర్పించిన వారిలో తలసేమియా రోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కాసర్ల రంజిత్‌కుమార్, జిల్లా కోఆర్డినేటర్ ఆత్రం లింగారావు ఉన్నారు.