ధ్యానం, యోగాతో మానసికోల్లాసం

కోట్‌పల్లి: ప్రతి నిత్యం ధ్యానం, యోగా చేయడంతో మానసికోల్లాసంతో ప్రశాంతత లభిస్తుందని లైఫ్‌ ఫౌండేషన్‌ ట్రస్టీ రాజశేఖర్‌ అన్నారు. మండలంలోని నాసన్‌పల్లి సమీపంలో 8 ఏండ్టు ధ్యాన కేంద్రం నడుస్తుంది. ఇక్కడ ప్రతి వారం చుటు ్టపక్కల ప్రజలే కాకుండా, విదేశాల నుంచి కూడా ధ్యానం, యోగా చేసేందుకు వస్తుంటారు. శనివారం తాండూర్‌ సిద్ధార్ద జూనియర్‌ కళాశాల నుంచి 150 మంది విద్యార్థులకు ధ్యానం, యోగా పై అవగాహన తరగతులను నిర్వహించారు. ఇందులో తాండూర్‌, వికారాబాద్‌ సిద్ధార్ద జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాల్స్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రస్టీ రాజశేఖర్‌ మాట్లాడుతూ మనిషి జీవితంలో ఎన్నో వత్తిడులతో అనేక రోగాల బారిన పడుతున్నారని, విద్యార్థులు చదువుల వత్తిడిలో పడి ఉత్తీర్ణత శాతంలోనూ వెనకంజలో ఉండిపోతున్నారన్నారు. ముఖ్యంగా విద్యార్థులు ధ్యానంతో చదువితే మనస్సు ప్రశాంతంగా ఉండి చదువుల్లో రాణిస్తారని స్పష్టం చేశారు.