పల్స్‌ పోలియో కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లుపక్కాగాచేయాలి

ఒంగోలు నగరం, డిసెంబరు 28: వచ్చేనెల 19న పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్‌ సురేష్‌కుమార్‌ తెలిపా రు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. శనివారం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం సమావేశం హాలులో జరిగిన మార్కాపురం డివిజన్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లు, హెల్త్‌ ఎడ్యుకేటర్లు, మల్టీపర్పస్‌ హెల్త్‌వర్కర్ల సమావేశం లో ఆయన మాట్లాడారు. పల్స్‌ పోలియో కార్య క్రమంలో 0-5 ఐదు సంవత్సరాలలోపు పిల్లలంద రికీ పోలియో చుక్కలు వేసేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. పల్స్‌పోలియో బూత్‌ల ఏర్పా టు, ఆయా కేంద్రాలకు పోలియో వ్యాక్సిన్‌ పంపి ణీ వంటి ఏర్పాట్లలో లోపం లేకుండా చూసుకోవా లన్నారు.

 

పల్స్‌ పోలియోకు సంబంధించిన కా ర్యాచరణ ప్రణాళికలను అన్ని పీహెచ్‌సీల నుంచి వెంటనే పంపించాలని ఆదేశించారు. జిల్లా కేం ద్రం నుంచి పీహెచ్‌సీలకు పంపించే మెయిల్స్‌ ను చెక్‌చేసుకోవాలన్నారు. ప్రతిరోజూ విధిగా చె క్‌చేసుకుని తగిన సమాచారాన్ని జిల్లా కేంద్రానికి పంపించాలని ఆయన కోరారు. ఆరోగ్య కార్యకర్తలకు తగిన సలహాలు సూచనలు ఇవ్వాలని ఆయన కోరారు. క్షయ, కుష్ఠు, కంటికి సంబంధించిన వ్యాధులను గుర్తిం చి చికిత్స అందించాలని ఆయన కోరారు. సమావేశంలో జిల్లా వ్యాఽధి నిరోధక టీకాల అధికారి డాక్టర్‌ పద్మజ, సహానా, ప్రసాద్‌ తదితరులు పాల్గొ న్నారు.