పరవాడ: రెండు రోజుల్లో రెండు దుర్ఘటనలు..ముగ్గురు మృత్యవాత.. విశాఖ పరవాడ ఫార్మాసిటీలో అసలేం జరుగుతుందో తెలియక కార్మికులు, పరిసర గ్రామాల వాసులు ఆందోళన చెందుతున్నారు. పరవాడ స్మైలెక్స్ ఫార్మా కంపెనీలో శుక్రవారం అర్ధరాత్రి రియాక్టర్ నుంచి విషవాయులు విడుదలై కెమిస్టు కేతిరెడ్డి అజయ్‌కుమార్(32), హెల్పర్ సత్యనాథ్ దిగార్(31) మృతిచెందడం కార్మికులను కలవరపాటుకు గురిచేసింది. తమను ఆదుకోవడంతో పాటు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతుల బంధువులు, కుటుంబసభ్యులు శుక్రవారం మధ్యాహ్నం 3గంటల నుంచి ఆందోళన ప్రారంభించారు. మృతదేహాలను కేజీహెచ్‌కు తరలించి ఇప్పటి వరకు చూపించక పోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి 9గంటలకు యాజమాన్యం దిగివచ్చి మృతులు కెమిస్టు కుటుంబానికి రూ.30లక్షలు, హెల్పర్ కుటుంబానికి రూ.12లక్షలు పరిహారం చెల్లించడానికి అంగీకారం తెలపడంతో ఆందోళన విరమించారు.