చిలమత్తూరు, డిసెంబరు 28: భర్త దాడిలో గాయపడిన ఓ గర్భిణికి పోలీసులు సకా లంలో స్పందించి ఆస్పత్రిలో చేర్పించి ప్రాణం నిలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... చిలమత్తూరు మండలంలోని పోతులప్పల్లికి చెందిన 8 నెలల గర్భిణి భారతిపై ఆమె భర్త రామాంజనేయులు శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో మద్యంమత్తులో విచక్షణా రహితంగా దాడి చేశాడు. కడుపుపై తన్నడంతో ఆమె పరి స్థితి విషమించింది. ఆసుపత్రికి తీసుకెళదామన్నా సకాలం లో వాహనాలు అందుబాటులో లేకపోవడంతో గ్రామస్థు లు ఎస్.ఐ వెంకటేశ్వర్లుకు సమాచారం అందించారు. ఆ యన జమేందార్ శంకరయ్య, కానిస్టేబుల్ మంజునాథ్‌తో కలిసి గ్రామానికి చేరుకొన్నారు. విపరీతంగా వాంతులు చే సుకుంటూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న గర్భవతి భారతిని ఎస్‌ఐ తన వాహనంలోనే బాగేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన వైద్యులు మెరు గైన చికిత్స కోసం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తర లించారు.
అక్కడి నుంచి అనంతపురం ప్రభుత్వ ఆసుప త్రికి తరలించారు. సకాలంలో మెరుగైన వైద్య చికిత్సల నిమిత్తం ఆస్పత్రికి పోలీసులు తీసుకెళ్లడంతో ఆమెతో పాటు కడుపులో బిడ్డ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆమెపై దాడికి పాల్పడి, వేధిస్తున్న భర్త, అత్త, ఆడపడుచులపై గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఆపదలో ఉన్న గర్భిణి ప్రాణాలు కాపాడినందుకు ఎస్పీ సత్యఏసుబాబు ఎస్‌ఐ వెంకటేశ్వర్లును అభినందించారు.