సూపర్‌ స్పెషాలిటీ డీఎం సీట్లకు కృషి

 


కర్నూలు  : కర్నూలు వైద్యశాలలో 2020 విద్యా సంవత్సరానికి సంబంధించి సూపర్‌ స్పెషాలిటీ విభాగంలో యూరాలజీ, నెఫ్రాలజీ, న్యూరోసర్జరీ, చిల్డ్రన్స్‌ సర్జరీ, ప్లాస్టిక్‌ సర్జరీలో డీఎం సీట్ల కోసం ఎంసీఐకి ప్రతిపాదనలు పంపామని, వాటి కోసం కృషి చేస్తామని వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌ అన్నారు. కర్నూలు వైద్య కళాశాలలోని తన ఛాంబరులో డాక్టర్‌ రంగనాథ్‌, డాక్టర్‌ లక్ష్మితో కలిసి శుక్రవారం మాట్లాడారు. ఈనెల 29న కర్నూలు వైద్య కళాశాలలో హాస్టల్‌డేను పురస్కరించుకుని ముఖ్య అతిథులుగా కలెక్టర్‌ వీరపాండియన్‌, ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప హాజరవుతారని చెప్పారు. వైద్య కళాశాలకు సంబంధించి రూ.300 కోట్లు, ఆసుపత్రికి రూ.300 కోట్ల జైకా నిధులు పెండింగులో ఉన్నాయని చెప్పారు