వైద్య సేవల్లో అలసత్వం తగదు

 

నవీపేట,  వైద్య సేవల్లో నిర్లక్ష్యం తగదని పాలనాధికారి నారాయణరెడ్డి అన్నారు. నవీపేట మండలం కేంద్రంలో సీహెచ్‌సీని శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగుల గదులు, మరుగుదొడ్లను పరిశీలించారు. సిబ్బంది హాజరు పట్టిక తనిఖీ చేసి పలువురు వైద్యులు, సిబ్బంది డుమ్మా కొట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గైర్హాజరుపై నివేదిక అందించాలని తహసీల్దారు లతను ఆదేశించారు. ముగ్గురు వైద్యులతో పాటు ఆరుగురు సిబ్బంది విధులకు హాజరు కాలేదని తహసీల్దార్‌ పాలనాధికారికి నివేదిక అందజేశారు. గైర్హాజరైన వైద్యాధికారి రాకేశ్‌ను పాలనాధికారి ఆదేశం మేరకు సస్పెండ్‌ చేసినట్లు డీఎంహెచ్‌వో సుదర్శనం తెలిపారు. విధులకు హాజరుకాని వైద్యురాలు తరుమ్‌నాజ్‌, దంత వైద్యురాలు శ్వేత, స్టాఫ్‌నర్సులు మేరి సరళకుమారి, ప్రసన్న, ఎల్‌డీ కంప్యూటర్‌ ఆపరేటర్‌ రజనిదేవి, ఆర్‌ఎన్‌టీసీపీ మంజుల, వోపీ ఏఎన్‌ఎం శారద, అప్తలిక్‌ అసిస్టెంటు జయకుమారిలకు డీఎంహెచ్‌వో మెమోలు జారీ చేశారు.