చిత్తూరు: చిత్తూరులోని ఓ మెడికల్ కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న విద్యార్థిని అక్షయ శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. అక్షయ కర్నూలు జిల్లా బేతంచెర్లకు చెందిన వెంకటరాముడు కుమార్తె అని పోలీసులు తెలిపారు. అక్షయ పది రోజుల క్రితమే బీఎస్సీ నర్సింగ్‌లో చేరింది. శనివారం యధావిధిగా కళాశాలకు వెళ్లి సాయంత్రం తిరిగి కళాశాల హాస్టల్ గదికి వచ్చింది. గదిలో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతి చెందింది. కుటుంబ సభ్యులను విడిచి చదువు కోసం ఇంతదూరం వచ్చిన అక్షయ ఒంటరితనాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకుందని సహ విద్యార్థినులు అంటున్నారు. ఈ సంఘటనపై ఎస్‌ఐ నాగసౌజన్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.