ప్రైవేటు ఆసుపత్రుల తనిఖీ

కర్నూలు : నగరంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో అమలు చేస్తున్న ఆరోగ్య శ్రీ సేవలపై వైఎస్‌ఆర్‌ ఆరోగ్య శ్రీ పథకం సీఈవో డా.మల్లికార్జున ఆదివారం ఆకస్మిక తనిఖీలు చేశారు. అమీలియో, మై క్యూర్‌ ఆసుపత్రుల్లో శుభ్రత, ఆరోగ్య శ్రీ వార్డులను తనిఖీ చేసి అక్కడ రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. మైక్యూర్‌ ఆసుపత్రిలో ఆరోగ్య శ్రీ పథకానికి సంబంధించి సీఎం సంతకంతో ఉన్న పత్రం ఇవ్వడం లేదని ఫిర్యాదులు చేశారు. 24 గంటల్లో సీఎం సంతకంతో ఉన్న లెటర్లను అందజేయాలని ఆసుపత్రి యాజమాన్యానికి ఆదేశించారు. ప్రతి రోగికి బ్యాంకు ఖాతా నంబర్‌ ఇవ్వడంపై అవగాహన కల్పించారు. ఈహెచ్‌ఎస్‌ వార్డులను పరిశీలించి రోగులతో మాట్లాడారు. రెండు ఆసుపత్రుల్లో ఈహెచ్‌ఎస్‌ విషయంలో ఉద్యోగులు, వారి మీద ఆధారపడిన వాళ్లు వచ్చినప్పుడు అవసరమైన వారికి అడ్మిషన్‌ ఇవ్వాలన్నారు. తిరస్కరిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక చేశారు. ఆయనతోపాటు ఆరోగ్య శ్రీ జిల్లా సమన్వయకర్త ఉన్నారు.