తాగునీరు కాదు..కాలకూట విషం!

జిన్నారం, గుమ్మడిదల ప్రాంతాల్లో ప్రమాదకర భూగర్భ జలాలు
పొరపాటున తాగితే తీవ్ర దుష్ప్రభావాలకు లోనవ్వాల్సిందే
నమూనాలు సేకరించి నివేదిక సిద్ధం చేసిన అధికారులు
 సంగారెడ్డి: కప్పుడు పచ్చని పంటలు పండించడానికి పనికొచ్చిన నీళ్లు.. నేడు ఎందుకూ పనికి రాకుండా పోయాయి. పొరపాటున వాటిని తాగితే తీవ్ర దుష్ప్రభావాలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం, గుమ్మడిదల మండలాల పరిధిలోని 35 గ్రామాల్లో 39 నీటి నమూనాలను సేకరించిన యంత్రాంగం వాటిని విశ్లేషించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిర్దేశించిన ప్రమాణాల కంటే అధిక మొత్తంలో మూలకాలు ఈ జలాల్లో ఉన్నట్లు  స్పష్టమైంది. ఈనెల 20న సంగారెడ్డిలో నిర్వహించిన జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశంలో సంబంధిత అధికారులు ఈ ఫలితాలను చదివి వినిపించారు. వాటి వల్ల కలిగే అనర్థాలనూ సభ్యులకు తెలియజేశారు.


 



ఇలా చేస్తే మేలు!
వర్షపు నీరు భూమిలోకి ఇంకేలా గృహాలు, పరిశ్రమల ఆవరణల్లో తప్పకుండా ఇంకుడు గుంతలు నిర్మించాలి.


నీటి నాణ్యతను పరీక్షించేలా పరిశ్రమలతో పాటు వాటి  చుట్టూ 50 మీటర్ల పరిధిలో బోరు బావులు ఏర్పాటు చేయాలి.
పరిశ్రమల్లో ఉపయోగించిన నీటిని శుద్ధి చేసేలా ఏర్పాట్లు ఉండాలి.


'జీరో లిక్విడ్‌ డిశ్చార్జి'ని ప్రతి పరిశ్రమ పాటించాలి.


జిన్నారం, గుమ్మడిదల ప్రాంతాల్లో ప్రమాదకర భూగర్భ జలాలు
పొరపాటున తాగితే తీవ్ర దుష్ప్రభావాలకు లోనవ్వాల్సిందే
నమూనాలు సేకరించి నివేదిక సిద్ధం చేసిన అధికారులు
ఈనాడు, సంగారెడ్డి



కప్పుడు పచ్చని పంటలు పండించడానికి పనికొచ్చిన నీళ్లు.. నేడు ఎందుకూ పనికి రాకుండా పోయాయి. పొరపాటున వాటిని తాగితే తీవ్ర దుష్ప్రభావాలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం, గుమ్మడిదల మండలాల పరిధిలోని 35 గ్రామాల్లో 39 నీటి నమూనాలను సేకరించిన యంత్రాంగం వాటిని విశ్లేషించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిర్దేశించిన ప్రమాణాల కంటే అధిక మొత్తంలో మూలకాలు ఈ జలాల్లో ఉన్నట్లు  స్పష్టమైంది. ఈనెల 20న సంగారెడ్డిలో నిర్వహించిన జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశంలో సంబంధిత అధికారులు ఈ ఫలితాలను చదివి వినిపించారు. వాటి వల్ల కలిగే అనర్థాలనూ సభ్యులకు తెలియజేశారు.


'ఈనాడు' కథనంతో కదలిక
జిన్నారం, గుమ్మడిదల మండలాల పరిధిలో పరిశ్రమల వల్ల జరిగిన విధ్వంసాన్ని వివరిస్తూ గతేడాది జనవరి 30న 'ఈనాడు' కథనాన్ని అందించింది. 'నీరు.. నేల.. విషమే.. నిలువెల్లా' శీర్షికన క్షేత్రస్థాయిలోని భయానక పరిస్థితులను కళ్లకు కట్టింది. దీనిపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ స్పందించింది. విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్‌తో పాటు భూగర్భజలశాఖ అధికారులను ఆదేశించింది. తాజాగా వీరు నివేదిక సిద్ధం చేసి ఆ ఫలితాలను వెల్లడించారు. లీటరు నీటిలో 45 మిల్లీ గ్రాముల మేర నైట్రేట్లు ఉండాలి. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన పరిమితి. కానీ ఈ ప్రాంతంలో సేకరించిన 29 నమూనాల్లో గరిష్ఠంగా లీటరు నీటిలో 540.3 మిల్లీ గ్రాముల మేర ఉన్నాయి. దీనివల్ల ఆరునెలల చిన్నారులు 'బ్లూబేబీ సిండ్రోమ్‌' బారిన పడతారని అధికారులు వివరించారు. సీసమూ అధికంగానే ఉంది. ఇది మెదడు, కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. క్రోమియం, మాంగనీస్‌, కాడ్మియం, నికెల్‌ల వల్ల అధిక రక్తపోటు, పురుషుల్లో పునరుత్పత్తి సామర్థ్యం తగ్గడం, కిడ్నీ వ్యాధులు, క్యాన్సర్‌ బారిన పడే ప్రమాదమూ ఉంది.



ఇలా చేస్తే మేలు!
వర్షపు నీరు భూమిలోకి ఇంకేలా గృహాలు, పరిశ్రమల ఆవరణల్లో తప్పకుండా ఇంకుడు గుంతలు నిర్మించాలి.


నీటి నాణ్యతను పరీక్షించేలా పరిశ్రమలతో పాటు వాటి  చుట్టూ 50 మీటర్ల పరిధిలో బోరు బావులు ఏర్పాటు చేయాలి.
పరిశ్రమల్లో ఉపయోగించిన నీటిని శుద్ధి చేసేలా ఏర్పాట్లు ఉండాలి.


'జీరో లిక్విడ్‌ డిశ్చార్జి'ని ప్రతి పరిశ్రమ పాటించాలి.