వైద్య పరిశోధనలకు మృతదేహాల అప్పగింత

విశాఖపట్నం: అనారోగ్యంతో మృతి చెందిన ఇద్దరు మహిళల మృతదేహాలను వైద్య పరిశోధనల కోసం కుటుంబ సభ్యులు ఆదివారం వైద్యకళాశాలకు అప్పగించారు. గోపాలపట్నం సమీపంలోని బాజీకూడలికి చెందిన గనివాడ ముత్యాలమ్మ (80), అనకాపల్లికి చెందిన ఎం.వెంకయ్యమ్మ (85) మృతదేహాలను వారి కుటుంబసభ్యుల నుంచి అనాటమీ విభాగ వైద్యురాలు డాక్టర్‌ వి.శాంతి స్వీకరించి ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. మృతదేహం ఆవశ్యకత, వైద్య పరిశోధనలు, వైద్యవిద్య బోధనకు ఏరకంగా ఉపయోగపడుతుందనే అంశాలను తెలియజేశారు. డాక్టర్‌ అర్చన, తదితరులు పాల్గొన్నారు.