హైదరాబాద్: ఇప్పటివరకు ప్రభుత్వ దవాఖానల్లో పురుడు పోసుకుంటేనే కేసీఆర్ కిట్లు ఇచ్చేవాళ్లు. ఇక నుంచి ప్రైవేటు వైద్య కళాశాలల్లో కాన్పులైనా కేసీఆర్ కిట్లు ఇవ్వనున్నారు. గతంలో ఈ ప్రతిపాదనను మంత్రి లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ అంగీకరించలేదు. తాజాగా ఆ ప్రతిపాదనకు సర్కారు సై అంది. ప్రభుత్వాస్పత్రుల్లోలాగానే తాము కూడా ఉచితంగా కాన్పులు చేస్తామని ప్రైవేటు వైద్య కళాశాలల యాజమాన్యాలు తెలిపాయి. దీనివల్ల పోస్టు గ్రాడ్యుయేషన్‌లో ఎండీ, గైనకాలజీ, పిడియాట్రిక్ విద్యార్ధులకు నైపుణ్యాలు పెరుగుతాయని పేర్కొన్నాయి.