సీఐఎస్‌ఎఫ్‌ బ్యారెక్స్‌లో రక్త దాన శిబిరం

జ్యోతినగర్‌: ఎన్టీపీసీ సీఐఎస్‌ఎఫ్‌ బ్యారెక్స్‌లో ఆదివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఏక్‌ భారత్‌-శ్రేష్ట భారత్‌ కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల రెడ్‌క్రాస్‌ సొసైటీ, ఎన్టీపీసీ ధన్వంతరి ఆస్పత్రి ఆధ్వర్యంలో చేపట్టిన శిబిరంలో పలువురు సీఐఎస్‌ఎఫ్‌ జవాన్లు రక్త దానం చేశారు. రక్తదానం వల్ల కలిగే లాభాలను వైద్యులు వివరించారు. రక్త దాతలకు ధ్రువపత్రాలు అందజేశారు. స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు వచ్చిన జవాన్లను కమాండెంట్‌ అభినందించారు. కార్యక్రమంలో సీఐఎస్‌ఎఫ్‌ కమాండెంట్‌ గుర్జీత్‌సింగ్‌, అసిస్టెంట్‌ కమాండెంట్‌ రమేష్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.