జనగామ : ప్రభుత్వ దవాఖానల్లో పేదలకు సర్కార్‌ఖరీదైన వైద్యం అందిస్తున్నదని ఎమ్మెల్యే ముత్తిడ్డి యాదగిరిడ్డి అన్నారు. శుక్రవారం వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ అశోక్‌కుమార్, టీబీ ప్రొగ్రాం అధికారి డాక్టర్ ధన్‌రాజ్ అధ్యక్షతన జిల్లా ప్రధాన దవఖానలో మున్సిపల్ కార్మికులకు ఉచిత వైదపరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈమేరకు ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని వైద్యశిబిరాన్ని ప్రారంభించి వైద్యపరీక్షలను చేయించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. కాగా హైదరాబాద్ నోవార్టీస్ కంపెనికి చెందిన అపోలో వైద్యబృందం అసంక్షికమిత వ్యాధుల నిర్థారణ వైద్య పరీక్షలను చేశారన్నారు. వైద్య పరీక్షల్లో ఒక్కొక్కరికి సుమారు రూ. ఎడెనిమిది వేల విలువైన టెస్టులు చేపట్టారని అన్నారు. కార్యక్షికమంలోజిల్లా ప్రధాన దవాఖాన పర్యవేక్షకులు డాక్టర్ రఘు, ఆర్‌ఎంవో డాక్టర్ సుగుణాకర్‌రాజు, మున్సిపల్ కమిషనర్ నోముల రవీందర్, వైద్యుడు శ్రీనివాస్, శ్రీధర్, బాలాజీ, సత్తయ్య, టీబీ విభా గం సిబ్బంది మధుశ్రీ, విశ్వనాధ్, జనగామ ఎంపీపీ కళింగరాజు, అంజిబాబు, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు బండ యాదగిరిడ్డి, మామిడాల రాజు, నిమ్మతి మహేందర్‌డ్డి, యాదగిరి, బాల్దే సిద్దిలింగం, మున్సిపల్ శాని ఎసై్స సుభాశ్ పాల్గొన్నారు.