రాజాపేట : బీడీ కార్మికులకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని బీడీ కార్మిక వెల్ఫర్‌ఫండ్ మెడికల్ అధికారి నిఖిల అన్నారు. బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సీఆర్‌ఎస్‌డీ, యాత్ర స్వచ్ఛంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో బీడీ కార్మికులకు వర్క్‌షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గుర్తింపు కార్డు కలిగి ఉన్న బీడీ కార్మికులకు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి ఎంతగానో కృషి చేస్తున్నామన్నారు. నియోజకవర్గంలో బీడీ కార్మికుల జీవన స్థితిగతులపై సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్షికమంలో యాత్ర సంస్థ డైరెక్టర్ సురుపంగ శివలింగం, సీఆర్‌ఎస్‌డీ సంస్థ ప్రతినిధులు ఉమాదేవి, రాములు, శ్రీకాంత్, లక్ష్మి, బీడీ కార్మికులు పాల్గొన్నారు.