వ్యాసెక్టమీపై అపోహలొద్దు


పీహెచ్‌సీల్లో ఆపరేషన్లు నిర్వహించాలి
-ట్యుబెక్టమీతో మహిళలకు ఆరోగ్య సమస్యలు
-కలెక్టర్ మస్రత్ ఖానమ్ ఆయేషా, ఎమ్మెల్యే ఆనంద్
వికారాబాద్,  : జిల్లాలో 154 సబ్ సెంటర్లలో తప్పనిసరిగా ఒక్కొక్క వ్యాసెక్టమీ ఆపరేషన్ అయినా చేయించాలని కలెక్టర్ మస్రత్‌ఖానమ్ ఆయేషా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి ఆదేశించారు. గురువారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని మహావీర్ మెడికల్ కళాశాలలో వ్యాసెక్టమీ పక్షోత్సవం సందర్భంగా జిల్లాలోని డాక్టర్లకు, ఆశ వర్కర్లకు, వైద్య ఆరోగ్య సిబ్బందికి అవగాహన కార్యక్షికమం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మస్రత్‌ఖానమ్ ఆయేషా మాట్లాడారు. జిల్లాలో వ్యాసెక్టమీ ఆపరేషన్లు నిర్వహించడం లేదని తెలిపారు. కుటుంబ నియంవూతణ ఆపరేషన్లు అంటే మహిళలే చేసుకోవాలని గుడ్డి నమ్మకం ప్రజల్లో ఏర్పడిందన్నారు. మహిళల కంటే పురుషులకు వ్యాసెక్టమీ ఆపరేషన్లు ఎంతో సులువని, అదే విధంగా ఆ కుటుంబానికి ఎంతో శ్రేయస్కరమని తెలిపారు. వ్యాసెక్టమీ ఆపరేషన్లు అయితే కోతా, కుట్టు లేకుండా సులువుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయవచ్చున్నారు.

ట్యూబెక్టమీ ఆపరేషన్లతో మహిళలకు ఎంతో ఇబ్బందులు ఉంటాయని తెలిపారు. వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ కుటుంబ నియంవూతణ ఆపరేషన్ ట్యూబెకమీతో మహిళలకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. పూర్తి అవగాహన లేక పోవడం వల్ల వ్యాసెక్టమీ ఆపరేషన్లు చేయించుకోవడం లేదన్నారు. చాలా తక్కువ మంది వ్యాసెక్టమి ఆపరేషన్లు చేయించుకుంటున్నారని తెలిపారు. అమెరికాలో ప్రతి సంవత్సరం 5 లక్షల మంది వ్యాసెక్టమీ ఆపరేషన్లు చేయించుకుంటున్నారని తెలిపారు. వ్యాసెక్టమీ ఆపరేషన్‌తో పురుషుల్లో ఎలాంటి లైంగిక సామర్థ్యం తగ్గదని తెలిపారు. దాంపత్య జీవితానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని, అపోహలు తొలగించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందన్నారు. మహిళలకు ఆపరేషన్లు చేయాలంటే ఖచ్చితంగా కడుపు కోసి నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు.

పురుషుల్లో మాత్రం బయటనే సులువుగా కేవలం 3 నిమిషాల్లో నిర్వహించవచ్చునని తెలిపారు. ఎలాంటి పనులనైన చేసుకోవచ్చునని తెలిపారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని తెలిపారు. వ్యాసెక్టమి వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని తెలిపారు.
వైద్య రంగంలో పని చేస్తున్నవారు ఈ ఆపరేషన్లను ప్రోత్సహించి నిర్వహించాలన్నారు. ప్రభుత్వ అధికారుల ద్వారా గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నారు. కార్యక్షికమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారి దశరథ్, మహవీర్ దవాఖాన సీఈవో డాక్టర్ ప్రభాకర్‌డ్డి, డాక్టర్ హరికృష్ణ, డిప్యూటీ డీఎంహెచ్‌వోలు జీవరాజ్, వికారాబాద్ ఎంపీపీ చంద్రకళ, వైద్య ఆరోగ్య సిబ్బంది , ఆశ వర్కర్లు ఉన్నారు.