మొయినాబాద్ : క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగులకు సమాజం మనోధైర్యం కల్పించాల్సిన అవసరం ఉందని, అలాగే వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాల్సిన అవసరముందని చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకుడు సీఎస్. రంగరాజన్ తెలిపారు. గురువారం నగరంలోని మహ్మద్ నవాబ్ జంగ్ క్యాన్సర్ ఆసుపత్రిలోని క్యాన్సర్ బాధితులను మధ్యాహ్నం వెళ్లి పరమర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాధితులంతా క్యాన్సర్ బారి నుంచి త్వరగా కోలుకోవాలని చిలుకూరు బాలాజీ స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. దేశంలో క్యాన్సర్ కన్నా తీవ్రమైనదని మరొకటి లేదని తెలిపారు. బాధితులకు తెలియకుండానే క్యాన్సర్ మహమ్మారీ వ్యాపిస్తుందని.. దీనికి లక్షల్లో ఖర్చుచేసి చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని వాపోయారు. ఆసుపత్రుల్లో రోగులను పరమర్శించే వారు రోగులకు మనోధైర్యాన్ని కల్పించే రెండు మంచి విషయాలు చెప్పి వారిని సంతృప్తిపరిచే విధంగా చూడాలని అక్కడున్న వారికి సూచించారు. కార్యక్రమంలో పవన్, సిబ్బంది, తదితరులున్నారు.