పేదల వైద్యానికి మంత్రి కేటీఆర్ భరోసా



ముస్తాబాద్: పేదల వైద్యానికి మంత్రి కేటీఆర్ భరోసానిస్తున్నారు. వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందజే స్తూ అండగా నిలుస్తున్నారు. మండలంలోని పలువురు ఎల్‌వోసీ మంజూరు చేసి మరోసారి ఔదార్యం చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రానికి చెందిన చెవుల పర్శరాములుయాదవ్ ఉపిరితిత్తుల్లో కణతి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ యశోద హాస్పిటల్‌కు వెళ్లారు. అక్కడి వైద్యులు ఆయనను పరీక్షించి పరిస్థితి విషమించిందని, వెం టనే శస్త్రచికిత్స చేయాలని, అందుకు రూ. 7లక్షలు ఖర్చవుతాయని వెల్లడిం చారు. అంత ఆర్థిక స్థోమత లేకపోవడంతో గొర్రెలకాపరి పర్శరాములు, ఆ యన కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. వారి దయనీయ స్థితి ని చూసి మండల ప్రజావూపతినిధులు, టీఆర్‌ఎస్ నాయకులు విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన అమాత్యుడు సకా లంలో వైద్యం అందించేందుకు రూ. 2 లక్షల ఎల్‌వోసీ మంజూరు చేసి అం డగా నిలిచారు. అదేవిధంగా మద్దికుంట గ్రామానికి చెందిన ఇద్దరికి రూ. 78 వేలను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరు చేయించారు. సంబంధిత చెక్కులును బాధితులకు ఎంపీపీ శరత్‌రావు బుధవారం అంజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ దయాహృదయుడని, ఆయన సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించండం ఇక్కడి ప్రజల అదృష్టమని కొనియాడారు. పేదకుటుంబాలకు అత్యవసర సమ యంలో అండగా నిలుస్తున్నారని వివరించారు. వైద్యానికి భరోసాగా నిలిచిన మంత్రి కేటీఆర్‌కు, సహకరించిన మండల ప్రజావూపతినిధులకు, నాయకుల కు రుణపడి ఉంటామని బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్షికమంలో ఏఎంసీ చైర్మన్ ఉల్లి యాది మల్లేశ్‌యాదవ్, సర్పంచ్ గాండ్ల సుమతి, ఉప సర్పంచు వేముల రవీందర్‌గౌడ్, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు సురేందర్‌రావు, ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు సర్వర్‌పా షా, రామలక్ష్మణుల పల్లె సర్పంచ్ రవీందర్‌డ్డి, అంజిడ్డి, భరత్, దేవేంద ర్, మల్లేశ్‌యాదవ్, స్వామి, నర్సింలు, సాదుల్‌పాషా పాల్గొన్నారు.