ప్రారంభించిన డీఎంహెచ్‌వో డాక్టర్ శ్రీనివాసులు
వనపర్తి వైద్యం: జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాకు సమీపంలో హోప్ ఎన్‌జీవో స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా హైచ్‌ఐవీ నిర్ధారణ పరీక్ష కేంద్రాన్ని గురువారం ఏర్పాటు చేసినట్లు ఐసీటీసీ కౌన్సిలర్ బండారి శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్ర మానికి ముఖ్యఅతిథిగా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీనివాసులు హాజరై ఉచిత హెచ్‌ఐవీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా డాక్టర్ మాట్లాడుతూ హెచ్‌ఐవీ రైట్ సమాజం కోసం డిసెంబర్1వ తేదీన ఎయిడ్స్ దినోత్సవం పురష్క రించుకుని ముందస్తుగా స్వచ్ఛంద సంస్థ వారి ఆధ్వర్యంలో ఉచితంగా హెచ్‌ఐవీ పరీక్షల నిర్ధారణ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ హెచ్‌ఐవీ పరీక్షలను మొత్తం 59 మందికి చేయగా, అందులో ప్రతి ఒక్కరికీ నెగిటివ్ వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ హరిశ్‌సాగర్, అసిస్టెంట్ డీహెంఎచ్‌వో డాక్టర్ రవిశంకర్, ఎన్జీవో ప్రతినిధులు శేఖర్, ఆంజనేయులు, శ్వేత పాల్గొన్నారు.