జగిత్యాల అర్బన్ : వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో బుధవారం రాష్ట్రస్థా యి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా వైద్య సేవలో జగిత్యాల జిల్లా ద్వితీయ స్థానం సాధించడంపై జిల్లా వైద్యాధికారి పుప్పాల శ్రీధర్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి శ్రీధర్ మాట్లాడుతూ కలెక్టర్ జిల్లా ఆరోగ్య శాఖ ప్రత్యేక అధికారి, మెట్‌పెల్లి సబ్ కలెక్టర్ గౌతమ్ పొట్రూ సూచనల మేరకు కృషి చేసి సెప్టెంబర్, అక్టోబర్ నెల ల్లో రాష్ట్రంలో ద్వితీయ స్థానానికి చేరుకున్నామని ఆయన తెలిపారు. గడిచిన ఆరు నెలల్లో రాష్ట్రంలోనే మొద టి స్థానంలో ఉన్న జిల్లా ఆ తర్వాత నాలుగో స్థానానికి చేరుకుందనీ, ప్రస్తుతం ద్వితీయ స్థానానికి చేరుకుందని తెలిపారు. ఈ సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చేతు ల మీదుగా అవార్డు తీసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్ ఎంఐడీ చైర్మన్ పీ కృష్ణమూర్తి, హెల్త్ సెక్రటరీ శాంత కు మారి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ యోగితా రా ణా, ఆరోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ రా వు, రమేశ్ రెడ్డి, అశోక్ కుమార్