జిల్లా క్షయవ్యాధి నివారణ అధికారి కల్యాణ్ చక్రవర్తి
పెద్దవూర : మండలంలోని పర్వేదుల గ్రామ పంచాయతీలో టీబీ క్యాంపు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా జిల్లా క్షయవ్యాధి నివారణ అధికారి కళ్యాణ్ చక్రవర్తి, సర్పంచ్ దండా మనోహర్‌డ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ జిల్లాలో క్షయవ్యాధి నిర్మూలనే లక్ష్యంగా అన్ని ప్రాంతాల్లో క్షయవ్యాధి క్యాంపులను ఏర్పాటు చేసి అత్యాధునిక పరిజ్ఞానంతో గ్రామాల్లోనే క్షయవ్యాధి పరీక్షలను నిర్వహిస్తున్నారు.
పాజిటివ్ ఉన్నచోట రోగులను ప్రత్యేంగా గుర్తించి వారికి ఉచితంగానే మందులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ నిర్వహించిన క్యాంపులో మొత్తం 50మందికి జనరల్ పరీక్షలు, 30మందికి తెమడ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్షికమంలో మండల వైద్యాధికారి పి.శంకర్, సూపర్‌వైజర్లు స్వరూప, స్టేల్లా ఎస్‌టీఎస్ కిశోర్, ల్యాబ్ టెక్నిషియన్స్ ఉమేష్, శ్రీనివాస్, ఏఎన్‌ఎంలు విజయ, లక్ష్మీ, ఆశలు పాల్గొన్నారు.