గిరిజన యువకుడికి వైద్య సేవలు


తిర్యాణి : తిర్యాణి మండలం మాణిక్యాపూర్‌ గ్రామ పంచాయతీ భీంపూర్‌ గ్రామానికి చెందిన ఆత్రం ఇస్రూ అనే గిరిజన యువకుడు నెల రోజుల నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతూ వైద్యశాలకు వెళ్లక మంత్రాలు, మూఢనమ్మకాలతో ఇంట్లోనే కాలం గడుపుతున్నాడు. పరిస్థితి విషమించడంతో మాణిక్యాపూర్‌ సర్పంచి వల్క రాధ రాంచందర్‌ ఈ సమాచారాన్ని తిర్యాణి ఎస్‌ఐ రామారావుకు తెలపడంతో వెంటనే ఆ గ్రామానికి చేరుకొని వారి కుటుంబ సభ్యులను కౌన్సెలింగ్‌ నిర్వహించారు. అతనికి మొదట తిర్యాణి వైద్యశాలలో వైద్యాధికారి స్పందన ప్రథమ చికిత్స చేశారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.