ఇందూరు: విద్యార్థులకు చదువుతో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమేనని జడ్పీ చైర్మ న్ దాదన్నగారి విఠల్‌రావు అన్నారు. బుధవారం జడ్పీ కార్యాలయంలో జడ్పీ స్థా యీ సంఘం సమావేశంలో భాగంగా రెం డో రోజు ఉదయం విద్య, వైద్యం, మధ్యా హ్నం మహిళ స్త్రీ సంక్షేమ శాఖ పై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, పౌష్ఠికాహారం ఇస్తున్నారా? లేదా అని సం బంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఇప్పటి వరకు ఎన్ని పాఠశాలలకు ప్రహరీలు పూర్తయ్యాయి, ఇంకా ఏమైనా అవసరముందా అని అధికారుల ను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్సీ వీజీగౌడ్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఎన్ని స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టా రు.. ఇంకా ప్రపోజల్స్ ఏమైనా ఉన్నాయ అని విద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు 391 మంది విద్యా వలంటీర్లు ఉన్నారని తెలుసుకుని, ఇంకా ఏమైనా ఖాళీలు ఉంటే వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. ఇందల్వాయి జడ్పీటీసీ గడ్డం సుమనాడ్డి మాట్లాడుతూ.. ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స చేయించుకోవడానికి వచ్చే వారి వివరాలను ఫోన్ ద్వారా కూడా వారి పేరును నమోదు చేయించుకునే వి ధంగా చూడాలని చెప్పారు. గ్రామాల నుం చి వృద్ధులు, మహిళలు, గర్భిణులు పొద్దు న్నే లేచి ఇక్కడికి వచ్చి దవాఖానల్లో పేరు నమోదు చేసుకొని చూపించుకునే సరికి రా త్రి అవుతోందని కావున దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఫోన్‌లోనే పేరు నమో దు చేసే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని వైద్యాధికారులను కోరారు.
ల్యాబ్, మెడికల్‌లలో అన్ని చోట్ల ఒకే ధర ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సదరం క్యాంప్‌ను మండల, డివిజన్ స్థాయిలో ని ర్వహించాలని కోరారు. అంగన్‌వాడీ కేం ద్రాల్లో గర్భిణులకు సంపూర్ణ భోజనం పథ కం సరిగా నిర్వహిస్తున్నారా? లేదా అని డి చ్‌పల్లి ఎంపీటీసీ, అధికారులను అడిగి తె లుసుకున్నారు. గర్భిణులకు సక్రమంగా భోజనం పెట్టాలని పుట్టబోయే బిడ్డకు ఇం తో మేలు చేస్తుందని ఆమె తెలిపారు. దీం తో మాత శిశు మరణాలు తగ్గుతాయన్నా రు. అంగన్‌వాడీ కేంద్రాలు మొత్తం ఎన్ని ఉన్నాయని జడ్పీ చైర్మన్ అడుగగా 258 ఉ న్నాయని అధికారులు తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆరేండ్ల వరకు ఉన్న పిల్లల వివరాలు, వయస్సుల వారీగా మొత్తం ఎంత మంది ఉన్నారో అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు ఆటల రూపంలో విద్యను బోధించాలని చెప్పారు. కార్యక్షికమంలో జ డ్పీ సీఈవో గోవిందు, కోటగిరి, ఇందల్వా యి, మెండోరా, వేల్పూర్, నందిపేట్, మో ర్తాడ్, మోపాల్ జడ్పీటీసీలు, ఆయా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.