పట్టణంలో ప్రత్యేక బృందం డెంగ్యూ సర్వే


ఆదిలాబాద్‌, నవంబరు28: డెంగ్యూ వ్యాధిలక్షణాలు ఆదిలాబాద్‌ పట్టణంలోనే అధికం గా ఉన్నాయన్న ఉన్నతాధికారుల నివేదికల దృ ష్ట్యా వరంగల్‌ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం గు రువారం పట్టణంలోని ఆయా వార్డుల్లోని ఇండ్లలో సర్వే నిర్వహించారు. డెంగ్యూ వ్యాధికి కారణమ య్యే దోమలను ప్రత్యేక గొట్టాల్లో బంధించి ప్ర జలకు ఆ దోమలు కలిగించే వ్యాధులు, అనర్థాల పై అవగాహన కల్పించారు. ప్రత్యేక బృందంలో హెచ్‌ఈవో అజయ్‌కుమార్‌, రఘునాథ్‌, సోమేశ్వ ర్‌లు జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, డీఎం హెచ్‌వో కార్యాలయ సిబ్బందితో ఆయా వార్డుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వారు ప్రజలకు మంచి నీరు నిల్వ ఉన్న ప్రాంతంలోనే దోమలు ఎక్కుగా నిల్వ ఉంటాయన్నారు.ముఖ్యంగా మంచి నీరు ఉన్న ప్రాంతంలోనే డెంగ్యూ వ్యాధికి సం బంధించిన దోమలు నివాసం ఏర్పర్చుకుంటు న్నాయని పేర్కొన్నారు.

 

ప్రజలందరు తమ పరి సరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు నీరు నిల్వకుండా చూడాలని సూచించారు. మం చి నీటిని నిల్వ ఉంచుకుంటున్న సందర్భంలో దానిపై కప్పు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. అప్పుడే డెంగ్యూ వ్యాధిని నివారించవచ్చని ఆ దో మల నివారణకు చర్యలు తీసుకోవచ్చని తెలిపా రు. ఇందులో ఫీల్డ్‌ వర్కర్లు మురళి, యాకుబ్‌ పాషా, ఎల్టీలు దిలీప్‌రెడ్డి, ముస్తాఫ్‌ అహ్మద్‌, ప్రా థమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది నవీన్‌ తదితరులున్నారు.