ఆత్మకూర్: పోలీసు సిబ్బంది ఆరోగ్యంగా ఉంటేనే విధులను సమర్థవంతంగా నిర్వహించవచ్చని భువనగిరి డీసీపీ కె.నారాయణరెడ్డి అన్నారు. ఆత్మకూర్ పోలీస్ స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. పోలీసులు ఆరోగ్యం కోసం తరచూ వైద్యులను సంప్రదించాలని సూచించారు. రాచకొండ పోలీస్ కమిషనర్ భగవత్ పోలీసులు వారి కుటుంబాల ఆరోగ్యం కోసం ఉచితంగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ కిమ్స్, మాక్స్ విజన్ కంటి ఆసుపత్రి, ఫోర్ట్ దంత వైద్యశాల వారి సహకారంతో ఆత్మకూర్, మోత్కూర్, అడ్డగూడూర్ ఠాణాల పోలీసు సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన వెంట చౌటుప్పల్ ఏసీపీ పి.సత్తయ్య, రామన్నపేట సీఐ వి.రంగ, వలిగొండ, అడ్డగూడూర్ ఎస్సైలు పి.శివనాగ ప్రసాద్, ఇద్రిస్ అలీ తదితరులు పాల్గొన్నారు.