గోదావరిఖని : ఆర్జీ-1 ఏరియా పరిధిలోని గోదావరిఖని ఏరియా దవాఖానలో కొత్తగా ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్ (రక్త నిధి)ని సంస్థ డైరెక్టర్ ఎస్.చంద్రశేఖర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రూ.1.7 కోట్ల వ్యయంతో కార్మిక కుటుంబాల సౌకర్యార్థం ఈ రక్తనిధి కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉద్యోగుల సంక్షేమానికై సింగరేణి యాజమాన్యం ఖర్చుకు ఏమాత్రం వెనుకాడదనీ, ఒక నర్సింగ్ కళాశాలను కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ ఆర్జీ-1 జీఎం విజయపాల్ రెడ్డి, సీఎంఓఏఐ అధ్యక్షుడు మనోహర్, ఏసీఎంఓ పీ.సుజాత, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు గండ్ర దామోదర్ రావు, డీజీఎం నవీన్, శేషుకుమార్, ఎస్‌ఓటూ జీఎం త్యాగరాజు, పీఎం ఎస్.రమేశ్, ఫిట్ సెక్రెటరీ రత్నమాల, డా.నారాయణ రెడ్డి సిబ్బంది ఉన్నారు.
జీఎంలతో డైరెక్టర్ సమీక్ష..
సింగరేణిలో భవిష్యత్‌లో చేపట్టబోతున్న కార్యాచరణపై సంస్థ డైరెక్టర్ ఎస్.చంద్రశేఖర్ ఆర్జీ-1 ఏరియాలోని కాన్ఫన్స్ హాల్‌లో అన్ని ఏరియాల అధికారులతో ప్రాజెక్ట్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. సింగరేణిలో జరుగుతున్న ప్రాజెక్టులను, భవిష్యత్‌లో రాబోయే కొత్త ప్రాజెక్టుల నిర్వహణ, అభివృద్ధి ప్రణాళిక, ఉత్పత్తి, ఉత్పాదకతను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో అన్ని ఏరియాల జీఎంలు, ప్రాజెక్టు అధికారులున్నారు.