బుక్కరాయసముద్రం, అనంతపూర్: మండలంలోని సంజీపురం గ్రామానికి చెందిన వివాహిత చాకలి సరస్వతి (29) కడుపు నొ ప్పి తాళలేక గురువారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ తెలిపిన మేరకు.... సంజీపురం గ్రా మానికి చెందిన చాకలి సురేష్, సరస్వతి దం పతులు ధోబీ వృత్తి చేసుకుని జీవనం సాగించేవారు. కొంత కాలంగా సరస్వతి కడుపునొప్పితో బాధపడేదన్నారు. పలు చోట్ల చికిత్స చే యించుకున్న నయం కాలేదు. ఈ నేపథ్యంలో గురువారం కడుపు నొప్పి తీవ్రంగా రావడంతో ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతిరాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. బుక్కరాయసముద్రం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.