వేసెక్టమి ఆపరేషన్లపై అవగాహన

బొంరాస్‌పేట : వేసెక్టమి పక్షోత్సవాల్లో భాగంగా కుటుంబ నియంవూతణ ఆపరేషన్లపై అవగాహన కల్పించడానికి బుధవారం మండల కేంద్రంలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ర్యాలీ, అవగాహన కార్యక్షికమం నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో సీహెచ్‌వో భాస్కరాచారి మాట్లాడుతూ పురుషులు వేసెక్టమి కుటుంబ నియంవూతణ ఆపరేషన్లు చేసుకోవాలని అవగాహన పెంచడానికి పక్షోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు

కుటుంబ నియంవూతణ ఆపరేషన్లు మహిళలకే కాకుండా వేసెక్టమి పేరుతో పురుషులకు కూడా చేస్తారని, ఎలాంటి కోత, కుట్టు లేకుండా ఈ ఆపరేషన్లు చేస్తారని ఆయన తెలిపారు. ఆపరేషన్లు చేసుకున్న పురుషులకు ప్రభుత్వం ప్రోత్సాహకంగా రూ.1100లు, ప్రోత్సహించిన ఆశ కార్యకర్తకు రూ.200లు చెల్లిస్తుందని భాస్కరాచారి తెలిపారు. వేసెక్టమీ ఆపరేషన్లు చేసుకోవడం వల్ల ఎలాంటి బలహీనత రాదని, ఒంట్లో శక్తి తగ్గదని సీహెచ్‌వో స్పష్టం చేశారు. కార్యక్షికమంలో హెల్త్ సూపర్‌వైజర్ మణిమాల, ల్యాబ్ టెక్నీషియన్ మునికుమార్, ఆయూష్ ఫార్మాసిస్టు సుదర్శన్, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.