రుద్రంగి: పౌష్ఠికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని ఎంపీపీ గంగం స్వరూపారాణి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రం-1లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ కార్యక్షికమంలో భాగంగా గర్భిణులకు అంగన్‌వాడీ టీచర్లు అందిస్తున్న రాగి లడ్డూలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రంలో అందిస్తున్న పౌష్ఠికాహారాన్ని చిన్నారులు, బాలింతలు తీసుకొని ఆరోగ్యవంతంగా ఉండాలన్నారు. గర్భిణులు పోషక విలువలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవాలన్నారు.
గ్రామంలోని అంగన్‌వాడీ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, ఆశాకార్యకర్తలు, పోషణ్ అభియాన్‌పై చిన్నారుల తల్లిదంవూడులకు, కిశోర బాలికలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్షికమంలో ఎంపీడీవో శంకర్, నాయకులు గంగం మహేశ్, అంగన్‌వాడీ టీచర్ గొమురె మంజూల, ఆశా కార్యకర్తలు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.