కారు ప్రమాద కారకునికి శస్త్ర చికిత్స


రాయదుర్గం: బయోడైవర్సిటీ పైవంతెన కారు ప్రమాదానికి కారణమైన కృష్ణ మిలన్‌ భుజానికి గురువారం వైద్యులు శస్త్రచికిత్స చేసినట్లు రాయదుర్గం పోలీసులు తెలిపారు. ప్రమాదం అనంతరం అతడిని గచ్చిబౌలి కేర్‌ ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో ఉంచి వైద్యం అందిస్తున్నారు.