మర్కూక్: టీబీపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉన్నప్పుడే సమాజం నుంచి టీబీని తరిమికొట్టవచ్చని జిల్లా క్షయ నివారణ అధికారి డా.శ్రీదేవి అన్నారు. గురువారం మండల పరిధిలోని దామరకుంటలో జరిగిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. టీబీ రోగులకు పోషకాహార నిమిత్తం నెలకు రూ.500 వారి ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తున్నదన్నారు. సిద్దిపేటలోని టీబీ కేంద్రంలో ఉచితంగా పరీక్షలు చేయడంతో పాటు టీబీ నిర్ధారణ అయినవారికి ఆరు నెలల పాటు ఉచితంగా మందులు ఇస్తామని తెలిపారు. కార్యక్షికమంలో డీఎంహెచ్‌వో డా.విజయారాణి, డీపీహెచ్‌ఎన్ ఏసుమేరి, పీహెచ్‌సీ ఎంవో డా.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.