పోలీసుల ఆరోగ్యం కోసం వైద్య శిబిరం ఏర్పాటు హర్షణీయం


ఆత్మకూరు(ఎం) : పోలీసుల ఆరోగ్యం కోసం రాచకొండ పోలీసు కమిషనరేట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని డీసీపీ కె.నారాయణడ్డి అన్నారు. గురువారం ఆత్మకూరు(ఎం) పోలీస్‌స్టేషన్‌లో రాచకొండ కమిషనరేట్ ఆధ్వర్యంలో అడ్డగూడూరు, మోత్కూరు మండలాల పోలీసు సిబ్బందితోపాటు వారి కుటుంబ సభ్యులకు కిమ్స్ దవాఖాన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు వైద్యులు గుండె, కండ్లు, చెవి పరీక్షలు నిర్వహించారు.
అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. పోలీస్‌స్టేషన్‌లోనే ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం పట్ల పోలీసులు హర్షం వ్యక్తం చేసి రాచకొండ సీపీ మహేశ్‌భగవత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్షికమంలో చౌటుప్పల్ ఏసీపీ సత్తయ్య, రామన్నపేట సీఐ ఎన్‌వీ రంగ, గుండాల, మోత్కూరు, వలిగొండ మండలాల ఎస్సైలు ఇద్రీస్ అలీ, శివనాగవూపసాద్, ఏఎస్సై అంజయ్య, పోలీసులు రాజ్‌కుమార్, మహ్మద్, విశ్వరూపాచారి, అంజయ్య, ఆసీఫ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.