నర్సింగ్‌ విద్యార్థుల డిజిటల్‌ ఎన్‌రోల్‌మెంట్‌కు అవకాశం


డిచ్‌పల్లి : గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా చీఫ్‌ సెక్రెటరీ ఆదేశాల మేర కు ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల్లో పనిచేస్తున్న ఏఎన్‌ఎంలతో పాటు జీఎన్‌ఎం నుంచి ఎమ్మె స్సీ నర్సింగ్‌ విద్యార్థుల వరకు తమ పేర్లను తప్పనిసరిగా డిజిటల్‌ ఎన్‌రోల్‌మెంట్‌ చేసుకో వాలని తిరుమల మెడికల్‌ అకాడమీ సెక్రెటరీ సరసాని పద్మావతిరెడ్డి కోరారు. ఈ మేరకు నిజామాబాద్‌ జిల్లా ఎన్‌రోల్‌మెంట్‌ కేంద్రాన్ని తిరుమల కళాశాల లో ఆమె ప్రారంభించారు.

 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్‌ఆర్‌ టీఎస్‌ ద్వారా ఉమ్మడి జిల్లాలోని ఏఎన్‌ఎంలు, స్టాఫ్‌ నర్సులు ఎంతమంది ఉన్నారో తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఆమె తెలి పారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సంస్థల్లో పనిచేసే వారికి ఈ ఎన్‌రోల్‌మెంట్‌ ఎంతో దో హదం చేస్తుందన్నారు. నిజామాబాద్‌ జిల్లా లోనే ఈ ఎన్‌రోల్‌మెంట్‌ ఆశించిన స్థాయిలో జరగడం లేదన్నారు. ఎన్‌రోల్‌మెంట్‌ చేసుకు న్న ప్రతిఒక్కరికీ ఐడీ కార్డు ఇవ్వడం జరుగు తుందని, ఈ అవకాశాన్ని ఏఎన్‌ఎంలు, స్టాఫ్‌ నర్సులు సద్విని యోగం చేసుకోవాలన్నారు. గురువారం తిరుమల మెడికల్‌ అకాడమీలో పేర్ల నమోదు కోసం జిల్లా నలుమూలల నుంచి ఏఎన్‌ఎం, స్టాఫ్‌ నర్సులు తరలివచ్చి తమ పేర్లను నమోదు చేసుకున్నారు.