వెల్దుర్తి: డాక్టర్ల స్థాయి నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని వెల్దుర్తి దవాఖాన నిర్వహణపై ఎంపీపీ స్వరూప, జెడ్పీటీసీ రమేశ్‌గౌడ్, సర్పంచ్ భాగ్యమ్మ, వైస్ ఎంపీపీ సుధాకర్‌గౌడ్‌లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం దవాఖాన అభివృద్ధ్ది కమిటీ సమావేశాన్ని అధ్యక్షుడు, ఎంపీపీ స్వరూప ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కమిటీ సభ్యులు ప్రజావూపతినిధులు మాట్లాడుతూ దవాఖాన నిర్వహణపై అసహనం వ్యక్తం చేశారు. దవాఖానకు చికిత్స కో సం వచ్చే రోగులకు కొత్త రోగాలు వచ్చేలా ఉన్నాయని డాక్ట ర్ బాపుడ్డిపై మండిపడ్డారు.
దవాఖానను తనిఖీ చేసిన సమయంలో ఇప్పటికీ సిబ్బంది తీ రు మారలేదన్నారు. వెల్దుర్తి దవాఖాన కు ఎంతో పేరు ఉండేదని సిబ్బంది తీరు, ప్రవర్తన సరిగ్గా లేదని, తక్షణమే మార్చుకోవాలన్నారు. అనుమతులు లేకుండా గైర్హాజరు కావడం రోగులతో అమర్యాదగా మాట్లాడడం వంటి సమస్యలు త మ దృష్టికి వస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా అటెండర్లు కొమురయ్య, ఆంజనేయులు విధులను గాలికి వదిలేస్తున్నారని మరోమారు జరిగితే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
దవాఖాన ను30 పడకలకు పెంచడానికి ఎమ్మెల్యే మదన్‌డ్డి సహకారంతో కృషి చేస్తామని అభివృద్ధ్దికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. దవాఖాన అభివృద్ధ్దికి నిధులు ఏడాదికి రూ. 7,500 వస్తాయని, ప్రస్తు తం ఉన్న నిధులలో నుంచి కొన్ని డబ్బులు దవాఖాన నిర్వహణకు ఇవ్వాల్సి ఉంది. అవి పోను రూ. 33 వేల నిధులు ఉంటాయని దవాఖాన లో పలు మరమ్మతులు చేపట్టాలని సమావేశంలో తీర్మానం చేశారు. ఈ సమావేశంలో ఎంపీడీవో జగదీశ్వరాచారి నా యకులు ఆంజనేయులు, నరేందర్‌డ్డి, సంజీవ్‌గౌడ్, డీడీవో నవీన్‌కుమార్, ఆయూష్ డాక్టర్ మల్లికార్జున్, హెచ్‌ఈవో ప్రదీప్‌కుమార్, సూపర్‌వైజర్లు, స్టాఫ్ నర్సులు, ఏఎన్‌ఎంలు, సిబ్బంది పాల్గొన్నారు.