లండన్: ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యానికి అడ్డుకట్ట వేయాల్సిన ఆవశ్యకతను బ్రిటన్‌లోని యూనివర్సిటీ కాలేజ్ లండన్(యూసీఎల్) పరిశోధకులు నొక్కిచెప్పారు. గాలి కాలుష్యం, గ్లకోమా(నీటికాసులు) మధ్య సంబంధమున్నట్లు తాజా అధ్యయనంలో వారు గుర్తించారు. వాయు కాలుష్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు గ్లకోమా బారినపడే ముప్పు ఇతరులతో పోలిస్తే ఆరు శాతం ఎక్కువగా ఉంటున్నట్లు వెల్లడించారు. అయితే, నేరుగా కాలుష్యమే దానికి కారణమవుతోందా? లేక ఇతర అంశాల ప్రభావముంటోందా? అనే అంశాలను స్పష్టంగా తెలుసుకునేందుకుగాను విస్తృత పరిశోధనలు చేపట్టనున్నట్లు చెప్పారు.