టీకాలు వేయించాలి


డిసెంబర్ 2న మిషన్ ఇంద్రధనస్సు
-ప్రాణాంతకమైన వ్యాధుల నుంచి రక్షణ
-ప్రజలకు అవగాహన కల్పించండి
-సంబంధిత అధికారులను ఆదేశించిన కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు
జయశంకర్ భూపాలపల్లి  : జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డిసెంబర్ 2వ తేదీన ప్రా రంభించనున్న మిషన్ ఇ ంద్రదనుష్-2.0 కార్యక్షికమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ వాసం వెంక సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ, బీసీ, ఎస్సీ, ఐసీడీఎస్, జిల్లా పంచాయతీ, మున్సిపల్ అధికారులతో మిషన్ ఇంద్ర ధనుష్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చిన్న పిల్లలకు రోటిన్ ఇమ్యూనైజేషన్ కార్యక్షికమంలో భాగంగా వారానికి రెండు సార్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఉచితంగా క్రమం తప్పకుండా టీకాలు వేస్తారని తెలిపారు.


 


కొందరు తల్లిదంవూడులు పిల్లలకు టీకాలు వేయించడంలో ఆశ్రద్ధ చేస్తారు కావున అలా టీకాలు తీసుకోని పిల్లల కోసం ఈ మిషన్ ఇంద్ర ధనస్సు కార్యక్షికమాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ, ఐసీడీఎస్, గ్రామ పంచాయతీ, మున్సి పాలిటీ, విద్యా శాఖ అధికారులు అందరూ కలిసి జిల్లాలో ఉన్న 0-5 సంవత్సరాల లోపు పిల్లలందరికి డిసెంబర్ 2 నుంచి నిర్వహించే కార్యక్షికమంలో తప్పని సరిగా టీకాలు ఇప్పించే విధంగా ఏర్పాట్లు చేయాలని అన్నారు. చిన్న పిల్లలకు సంక్రమించే క్షయ, పోలియో, హెపటైటిస్-బి,కొరింత దగ్గు, కంటస్పరి, తట్టు, హిమోఫిలిస్, ఇన్‌ప్లూ వంటి ప్రాణాంతకమైన వ్యాధుల నుంచి రక్షణ కల్పించే మిషన్ ఇంద్రధనుష్‌ను వినిమోగించుకోవాలని అన్నారు.

ఈ వ్యాధులకు సంబంధించిన టీటీ, బీసీజీ, పెంటా వైరస్, రోటా వైరస్, ఐపీయూ, టీడీ, జేఈ మందులు ఇంజక్షన్‌లు ప్రతి ఆరోగ్య కేంద్రాలలో , ఉప ఆరోగ్య కేంద్రాలలో అందుబాటులో ఉన్నాయని అన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామ గ్రామాన ఈ కార్యక్షికమం ప్రజలకు తెలిసేలా అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు ప్రతి ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. సంక్షేమ వసతి గృహలలో ఉండే 10-16 సంవత్సరాల పిల్లలకు ప్రత్యేక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసి ఆశా, ఆరోగ్య కార్యకర్తల ద్వారా టీడీ ఇంజక్షన్ ఇవ్వాలని తద్వారా వసతి గృహల్లో ని పిల్లలకు మెదడు వాపు వ్యాధి రాద న్నారు. అనంతరం మిషన్ ఇంద్రధనుష్ -2.0 పోస్టర్‌ను అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్షికమంలో కలెక్టరేట్ ఏవో మహేశ్ బాబు, ప్రోగ్రాం అధికారిణి డాక్టర్ మమతాదేవి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారిణి అవంతిక, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, బీసీ అభివృద్ధి అధికారిణి శైలజ, ఎస్సీ అభివృద్ధి అధికారిణి సునీత తదితరులు పాల్గొన్నారు.