మెదక్ : జిల్లాలోని ప్రజలకు ఫ్యామిలీ ప్లానింగ్ పద్ధతులపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని డీఎంహెచ్‌వో డాక్టర్ వెంక తెలిపారు. గురువారం జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వైద్యాధికారులు, ఫార్మాసిస్టులకు, ఆశానోడల్ సూపర్‌వైజర్లకు (ఎఫ్‌ఎం-ఎల్‌ఎంఐఎస్) శిక్షణ కార్యక్షికమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో వెంక మాట్లాడుతూ శాశ్వత కుటుంబ నియంవూతణ శస్త్ర చికిత్సలను ప్రోత్సహించకుండా తాత్కాలిక పద్ధతులను తెలియజేయాలని సూచించారు.
మన జిల్లాలో అంతర ఇంజక్షన్‌ను గత జూలై మాసంలో ప్రారంభించడం జరిగిందని, దానికి విశేష ప్రాచుర్యం లభించిందని, అదే విధంగా ఇతర తాత్కాలిక కుటుంబ నియంవూతణ పద్ధతులను కూడా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని వైద్యాధికారులను ఆదేశించారు. వచ్చే మూడు నెలల్లో ఆశాలకు, ఏఎన్‌ఎంలకు విధిగా తాత్కాలిక పద్ధతులు, వాడే విధానంపై ప్రజలకు స్పష్టంగా చెప్పాలని తెలిపారు. శిక్షణకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో జిల్లాకు, జిల్లా నుంచి రాష్ట్రానికి చేయాలని ఏం మాత్రం అజాక్షిగత్త వహించవద్దని తెలిపారు. శుక్రవారం నర్సాపూర్, తూప్రాన్ డివిజన్లకు సంబంధించిన వైద్యాధికారులకు, ఫార్మాసిస్టులకు, ఆశానోడల్ సూపర్‌వైజర్లకు ఎఫ్‌పీ, ఎల్‌ఎంఐఎస్ శిక్షణ ఉంటుందని తెలిపారు.
కార్యక్షికమంలో ఎఫ్‌పీ నోడల్ ఆఫీసర్ డాక్టర్ సుమిత్ర, అసిస్టెంట్ డీఎంహెచ్‌వో డాక్టర్ రాజు, రాష్ట్ర కన్సప్టూంట్ డాక్టర్ అనిల్, డాక్టర్ ఇర్షాద్, డాక్టర్ నవీన్, డిప్యూటీ డీఎంహెచ్‌వో అనిల, డెమో పాండురంగాచారి, డీపీహెచ్‌ఎన్‌వో లిల్లీ, డీడీఎం స్వాతి, డీపీఎం కోట, వివిధ పీహెచ్‌సీల వైద్యాధికారులు, ఫార్మాసిస్టులు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.