విధులకు 7 నెలల గర్భిణి









మంథని: పెద్దపల్లి జిల్లా మంథని డిపోకు చెందిన ఏడు నెలల గర్భిణి అయిన కండక్టర్‌ సుమలత శుక్రవారం విధులకు హాజరయ్యారు. 55 రోజుల సమ్మె, సెప్టెంబరు నెల వేతనం లేకపోవడం, కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో తాను విధులకు హాజరైనట్లు సుమలత తెలిపారు. కాగా, మంథనికి చెందిన స్థానికుడు మారుపాక సత్యనారాయణ.. సుమలతకు రూ.5 వేల నగదు, పండ్లు, బట్టలు అందించారు